ఎస్ఎల్‌బీసీ పర్యటనకు బీజేపీ నేతలు.. ఈ టైంలో రాజకీయాలొద్దు : పాయల్ శంకర్

-

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో దోమల‌పెంటకు చేరుకోనున్నారు.ఎస్‌ఎల్‌బీసీ వద్ద కొనసాగుతోన్న సహాయక చర్యలను వీరు పరిశీలించనున్నారు.

ఈ క్రమంలోనే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ..ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యహరించాలని అన్నారు.ప్రమాదానికి ముందు పనులపై సర్కార్ నిఘా కొరవడినట్లుగా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రస్తుతం కేంద్ర బలగాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని వివరించారు. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తుందని చెప్పారు. ఈ విషాద టైంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version