పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోశ్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. యూత్ ఎంటర్‌టైనర్ రూపొందిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబరు 6వ తేదీన థియేటర్లలో విడుదలై యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘నెట్‌ఫ్లిక్స్’లో నవంబరు 3వ తేదీ మ్యాడ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ‘మీ అందరికీ ఓ శుభవార్త’ అంటూ సదరు సంస్థ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
స్టోరీ ఏంటంటే.. : మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ (RIE) స్టూడెంట్స్. బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి మంచి స్నేహితులవుతారు. మనోజ్.. శృతి (గౌరి)ని ప్రేమిస్తుండగా.. జెన్నీ (అనంతిక).. అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. ఇక దామోదర్ అలియాస్ డీడీకి గుర్తుతెలియని వెన్నెల అనే అమ్మాయి లవ్ లెటర్ రాసి తనను ప్రేమలో పడేలా చేస్తుంది. వెన్నెలను చూడకుండానే నాలుగేళ్లు గడిపిన డీడీ.. చివరకు వెన్నెలను వెతికుతాడు. ఈక్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మధ్యలో లడ్డు (విష్ణు) కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.