మద్రాస్ హై కోర్టులో విశాల్ కు చుక్కెదురు..!

-

హీరో విశాల్‌ పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యాడు విశాల్. అయితే  వైట్ పేపర్స్ పై తాను సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని జడ్జి ఎదుట వాదించాడు విశాల్.

చాలా  తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా? ఇదేమి షూటింగ్ కాదు.. సరిగ్గా సమాధానం చెప్పండి అంటూ విశాల్ ని ఆదేశించించారు న్యాయమూర్తి. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించిన  సండకోజి 2 చిత్రం యొక్క తమిళ మరియు తెలుగు థియేట్రికల్,  శాటిలైట్ హక్కుల చుట్టూ వివాదం కేంద్రీకృతమై ఉంది . 2018లో సినిమా విడుదలైనప్పుడు లైకా ప్రొడక్షన్స్ ఈ హక్కులను ₹23.21 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మరో వైపు రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడంటూ లైకా ప్రొడక్షన్ 2022లో కోర్టు పిటిషన్ దాఖలు చేసింది.   ఈ వివాదం పై కోర్టులో కేసు నడుస్తోంది. తాజాగా కోర్టు ఈ కేసును వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version