లేటువయసులో లేటెస్ట్ గా అదరగొడుతున్న చిరంజీవి.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి.

ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. తాజాగా 215 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక చిరంజీవి రాజకీయాలు వదిలి మంచి పని చేశాడంటూ చిరు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీనితో చిరంజీవి కూడా తాను చేయాలనుకున్న డైరెక్టర్స్ జాబితా తీసి వరసగా లైన్ లో పెట్టుకుంటున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు యంగ్ డైరక్టర్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ ఉన్న చిరు నెక్స్ట్ సినిమా కోసం కూడా రూట్ మ్యాప్ క్లియర్ చేస్తున్నాడు. ఇప్పుడు చిరు వెయిటింగ్ లిస్టులో వెంకీ కుడుముల , దానయ్య సినిమా, అలాగే యూవీ క్రియేషన్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. వీరితో పాటుగా మరికొందరు నిర్మాతలు దర్శకులు కూడా వాల్తేరు వీరయ్య సినిమా విజయం తర్వాత వరుసగా చిరంజీవి ఇంటికి క్యూ కడుతున్నారు. అయితే ఇందులో చిరు 156వ సినిమా ఏది 157వ సినిమా ఏదనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అంతగా మెగాస్టార్ చిరంజీవి లైనుప్ ఉంది మరి.

 

Read more RELATED
Recommended to you

Latest news