‘గుంటూరు కారం’ సినిమాతో మహేశ్ బాబు రికార్డు

-

Mahesh Babu : ‘గుంటూరు కారం’ సినిమాతో మహేశ్ బాబు రికార్డు సృష్టించారు. మిక్స్డ్ టాక్ వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. USAలో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను దాటగా…. ప్రిన్స్ కెరీర్ లో ఈ ఘనత సాధించిన 5వ సినిమాగా నిలిచింది. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట చిత్రాలు ఈ ఘనతను అందుకోగా…. ప్రభాస్ తర్వాత ఈ రికార్డు సాధించిన హీరోగా సూపర్ స్టార్ నిలిచారు.

Mahesh Babu’s Guntur Karam Shatters Records

కాగా, 2 రోజుల్లో ఈ మూవీ రూ. 127 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇది ఇలా ఉండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెలిపిన గుంటూరు కారం పై కొందరు కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని మేకర్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో లో గుంటూరు గారు మూవీకి 0/1 రేటింగ్ పై 70 వేల ఓట్లు పడడం పై ఆరాచేయాలని సైబర్ పోలీసులను గుంటూరు కారం సినిమా చిత్ర బృందం ఆశ్రయించినట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version