Team India : ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్న భారత క్రికెటర్లు

-

Team India : భారత క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రవి బిష్నోయ్ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ఉదయం నిర్వహించిన భస్మహారతిలో వారు పాల్గొన్నారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో బిష్నోయ్ రెండు వికెట్లు తీశారు.

Indian cricketers offer prayers at Mahakaleshwar Temple in MP’s Ujjain

గతంలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రాహుల్ దంపతులు ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పై జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై చెలరేగిపోయారు. దీంతో టీమిండియా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version