SSMB29 క్రేజీ అప్డేట్.. డ్యూయెల్ రోల్లో మహేశ్ బాబు!

-

సంక్రాంతికి గుంటూరు కారంతో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు తన నెక్స్ట్ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మహేశ్ బాబు పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా లుక్పైన ఆయన ఫోకస్ చేస్తున్నారు. గ్రాండ్ స్కేల్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం వల్ల హాలీవుడ్ కూడా ఈ సినిమాపైన ఫోకస్ పెట్టింది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదో అప్డేట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. SSMB 29లో మహేశ్ బాబు డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని టాక్. ఇప్పటి వరకు హీరోగా మహేశ్ బాబు ఒక్కసారి కూడా డబుల్ రోల్ చేయలేదు. దీంతో మొదటిసారిగా మహేశ్ బాబును డబుల్ రోల్లో చూడబోతున్నామని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. SSMB 29లో మహేశ్ డ్యుయెల్ రోల్పై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version