ఆరూరి రమేష్ ఇంటికి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమకొండలోని ఆరూరి ఇంటి దగ్గర హైడ్రమా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ రాజీనామాకు సిద్ధమై ప్రెస్ పెట్టేందుకు సిద్ధం అయ్యారు ఆరూరి రమేష్. ఈ తరుణంలోనే… ఆరూరి రమేష్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు.
ఆరూరి రమేష్ ను ఇంకా బుజ్జగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేముందు ఆరూరిని ఇంట్లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఇవాళ సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరికి చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో జై ఆరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. మరి ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.