తన భార్య నమ్రతపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

-

ఇవాళ తన భార్య నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు స్పెషల్ విషెస్ తెలిపారు. ‘కలిసికట్టుగా ప్రేమతో మరో సంవత్సరం నిండినందుకు సంతోషంగా ఉంది. నా ప్రతిరోజును ఎంతో అద్భుతంగా మార్చినందుకు నీకు ధన్యవాదాలు. ఈ ఏడాది గొప్పగా ఉండాలి’ అని X లో రాస్కొచ్చారు లవ్ సింబల్స్ ను షేర్ చేశారు.

Mahesh Babu’s emotional post on his wife Namrata

కాగా,  ఘట్టమనేని మహేష్ బాబు పరిశ్రమకు విచ్చేసి 44 ఏళ్ళు గడిచిపోయింది. ఒక బాల నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు. మహేష్ బాబు మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం 1979 లో వచ్చిన “నీడ”. ఇక ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు బాలనటుడిగా చేశాడు.

ఇక మహేష్ బాబు పూర్తి స్థాయి యంగ్ హీరోగా రాజకుమారుడు చిత్రంతో మారాడు, ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇప్పటికే మంచి వసూళ్లను సినిమా రాబడుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సత్తా చూపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version