విశాఖ ప్రేమోన్మాది అరెస్ట్

-

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోటు చేసుకుంటున్న ప్రేమోన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి మరణించగా.. కూతురు పరిస్తితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసారు. నిందితుడు దాడి అనంతరం అక్కడి నుంచి బైకు పై పారిపోయాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ తరుణంలో తల్లి, కూతురు పై దాడి చేసిన ప్రేమోన్మాది నవీన్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా.. శ్రీకాకుళం సమీపంలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో బూర్జ మీదుగా వీరఘట్టం వెళ్తుండగా అతన్ని అదుపులోకి తీసుకొని విశాఖకు తరలిస్తున్నారు. ఆ యువతికి అతనికి సంబంధం ఏంటి..? అనే కోణంలో విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version