మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్..!!

-

ఎంతోమంది అమ్మాయిలు చైల్డ్ ఆర్టిస్టులు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. శ్రీదేవి , మీనా వంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ లు అందరూ కూడా హీరోయిన్ గా మారతారు అని గ్యారెంటీ లేదు. పెద్దయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.ముఖ్యంగా అలాంటి వారిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నిహారిక కూడా ఒకరు. నిహారిక అంటే అందరికీ మెగా డాటర్ గుర్తుకు వస్తుంది. కానీ మహేష్ బాబు చెల్లెలు అంటే మాత్రం ఒక్కడు సినిమా గుర్తు వస్తుందని చెప్పవచ్చు.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ఒక్కడు సినిమాలో మహేష్ బాబును ఆటపట్టించిన అల్లరి చెల్లి ఆశ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ పిల్ల బేబీ నిహారిక. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాంరా, మహేష్ బాబు నటించిన ఒక్కడు, మోహన్ బాబు నటించిన యమజాతకుడు వంటి పలు చిత్రాలలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక చివరిగా ఒక్కడు సినిమా తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. నిహారిక సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా చదువు పైన దృష్టి సారించింది.

దాదాపు పది సంవత్సరాల క్రితం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ప్రస్తుతం ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఇక ఈమె వివాహానికి ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా నిహారిక వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version