మహేష్ కోరిక నెరవేరిందా…?

-

మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మర్యాద రామన్న సినిమా తర్వాత మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. కాని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కోరిక నెరవేరలేదు. ఇక బాహుబలి సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని భావించినా అది కూడా సాధ్యం కాలేదు.

మహేష్ బాబుతో జక్కన్న సినిమా చెయ్యాలి అనుకున్నా సరే మళ్ళీ భారీ ప్రాజెక్ట్ మీదే దృష్టి పెట్టారు. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు… తో జక్కన్న సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం మహేష్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో అవసరం అయితే తాను ఒక్కడినే పెట్టుబడి పెట్టాలి అని మహేష్ భావిస్తున్నాడు. అవసరం అనుకుంటే రాజమౌళి కి షేర్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు డ్రీం అనేది టాలీవుడ్ జనాల మాట. అతని కోసం కథ కూడా జక్కన్న ఎప్పటి నుంచో రెడీ గా ఉంచారని కూడా అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే తర్వాత సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news