తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అప్పక్ పల్లిలో పెట్రోల్ బంకు ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదు. పీవీ నరసింహారావు హయాంలో మహిళా సంఘాలు ఏర్పడ్డాయని.. రాజశేఖర్ రెడ్డి వారిని మరింత అభివృద్ధి చేశారని.. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న డీ.కే.అరుణ కూడా మహిళల కోసం కృషి చేశారని తెలిపారు.
మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా ఎదగాలి అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. మన చుట్టాలు ఎవ్వరూ ఉన్నా సంఘాల్లో చేర్చండి. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం మహిళల శక్తి చూపించాలి. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. ప్రతీ జిల్లాకొక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని సూచించారు.