Mahesh babu: ఆ విషయంలో నా నిర్ణయమే ఫైనల్.. నమ్రతతో కూడా మాట్లాడను: మ‌హేశ్ బాబు

-

Mahesh babu: మ‌హేశ్ బాబు .. ఆ పేరులోని ఓ ప‌వ‌ర్ ఉంది. త‌న న‌ట‌న‌తో మెప్పించి, సూపర్ స్టార్ ఎదిగాడు. వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. కాస్త ఖాళీ సమయం దొరికినా సరే కుటుంబంతో సహా వెకేషన్‌కు వెళుతుంటారు. ముఖ్యంగా మహేష్ కుటుంబసభ్యులతో విదేశాలను సందర్శిస్తుంటారు. కానీ.. కొన్ని విష‌యంలో మాత్రం త‌న నిర్ణ‌యమే ఫైన‌ల్ అంటున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మహేశ్ బాబు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. చాలా రోజులుగా ఉన్న ఓ డౌట్ ను క్లీయ‌ర్ చేశాడు.

మహేశ్ బాబు.. త‌న క‌థ ఎంపిక విష‌యంలో చాలా మంది అభిప్రాయాలు తీసుకుంటాడ‌నీ, ఆ విష‌యంలో ఇత‌ర‌ల‌పై ఆధార‌ప‌డుతాడ‌ని అనేక రకాల రూమర్స్ ఉన్నాయి. ముఖ్యంగా నమ్రత.. ఆమె ఆధీనంలోనే స్క్రిప్టులు ఉంటుంద‌ని, ఆమె కోరితే కథలో మార్పులు కూడా చేయడానికి చాలామంది దర్శకుడు సిద్ధం అవుతారని కూడా టాక్ వచ్చింది. ఆ విషయంలో మహేష్ బాబు ఒక క్లారిటీ చేశాడు.

కథల ఎంపిక విషయంలో నమ్రత పాత్ర ఏమి ఉండ‌ద‌ని నాకు న‌చ్చితేనే వాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాన‌ని అన్నారు. ప్లాప్ అయినా కూడా నేను వినే ప్రతి స్క్రిప్ట్ కూడా నా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
అస‌లు సినిమా విష‌యాల‌ను నమ్రతతో ఏ మాత్రం చర్చలు జరపను. స్టార్డమ్ అన్నది కూడా బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదని మహేష్ బాబు తెలియజేశాడు.

మ‌హేశ్ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతున్నది. ఈ చిత్రం యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం పెట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version