మంచు వారింట హాలోవిన్ హంగామా!

-

మంచు వారింట హ‌లోవిన్ హంగామా.. వెస్ట్ర‌న్ కంట్రీస్‌కి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ హ‌లోవీన్ ఫెస్టివెల్‌ని సెల‌బ్రిటీలు తెలుగు రాష్ట్రాల్లోనూ రుద్దేస్తున్నారు. ఈ ఫెస్టివెల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మంట‌లు వెలిగించి ద‌య్యాల‌ని పిశాచాల్ని పార‌ద్రోల‌డం.. ఇది కేవ‌లం పాశ్చాత్య దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఫెస్టివెల్. దీన్ని మ‌న టాలీవుడ్ తార‌లు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.

గ‌త ఏడాది మెగా ఫ్యామిలీ ఈ ఫెస్టివెల్‌ని వింత వింత గెట‌ప్‌ల‌తో సెల‌బ్రేట్ చేసుకుంది. మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌, నిహారిక ఘోస్టుల్లా మేక‌ప్ వేసుకుని హంగామా చేశారు. ఆ త‌రువాత చిరు కూడా త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి హ‌లోవీన్ ని ఎంజాయ్ చేశారు. తాజాగా మంచు ల‌క్ష్మి కూడా త‌న పిల్ల‌ల‌తో హ‌లోవీన్ ఫెస్టివెల్‌ని ఎంజాయ్ చేస్తోంది.

త‌న కూతురు నిర్వాణ‌కు ఘోస్ట్‌లా ముస్తాబు చేసి మురిసిపోయింది. ఈ సంద‌ర్భంగా నిర్వాణ ఫొటోలని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. `ఈ ఏడాది హ‌లోవీన్ మ‌రింత అందంగా.. మ‌రింత భ‌యంక‌రంగా వుంది.. ఎందుకంటే ఈ బాలిక‌లు మిమ్మ‌ల్ని ఆనంద‌ప‌రుస్తారు` అని పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం మంచు ల‌క్ష్మి షేర్ చేసి ఫొటోలే ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version