నాపై మోహన్‌బాబు అనుచరులు దాడి చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో మంచు మనోజ్. మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో ట్విస్ట్ నెలకొంది. నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి..
తనను తండ్రి కొట్టాడని పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడట.. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలపై హీరో మంచు మనోజ్ స్పందించారు. తన అనుచరుల చేత మోహన్‌బాబు నాపై దాడి చేయించారన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని తెలిపారు. మా నాన్న చెప్పడం వల్లే అతను నాపై దాడికి తెగబడ్డాడని వివరించారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ ప్రకటించారు మంచు మనోజ్.