ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి..పాలైంది. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 337 పరుగులకు… ఆల్ అవుట్ అయింది.దీంతో 155 పరుగులకు పైగా..లీడ్ సంపాదించింది ఆస్ట్రేలియా. ఇక రెండో వైనింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కంటే దారుణంగా విఫలమైంది.
దీంతో రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులకు ఆల్ అవుట్ కావడం జరిగింది టీమిండియా. ఇక 19 పరుగులను అవలీలగా సాధించి 10 వికెట్ల తేడాతో టీమిండియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-1 తేడాతో సమం చేసింది ఆస్ట్రేలియా. ఇక టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. లో రోహిత్ సేన ఓటమితో డబ్ల్యూటీసి పాయింట్స్ టేబుల్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రెండవ టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా మొదటి స్థానానికి వచ్చింది. ఓడిన టీమ్ ఇండియా మాత్రం మూడవ స్థానానికి పడిపోయింది.
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయిన భారత్..
- పాయింట్ల పట్టికలో 57.29 శాతంతో మూడో స్థానంలో టీమిండియా..
- అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపుతో మూడో స్థానానికి పడిపోయిన భారత్..
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 60.71 శాతంతో తొలి స్థానంలో ఆసీస్..
- 59.26 శాతంతో రెండో స్థానంలో దక్షిణాఫ్రికా