గత కొద్ది రోజుల నుంచి మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. మొన్న మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మోహన్ బాబు రాచకొండ సీపీకి ఓ లేఖ కూడా రాసిన విషయం విధితమే. ఇవాళ మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది.
మనోజ్ ని విష్ణు బౌన్సర్లు బయటికి పంపించడం.. మౌనికతో మనోజ్ బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడటం వంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనోజ్ పై దాడి చేసిన ఫుటేజ్ మాయం పై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ తరుణంలోనే పని మనిషి కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. షాపు గురించే వారికి గొడవ జరిగిందని తెలిపారు. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకు ఇష్టం లేదు. వేరే ఎవరికో పుట్టిన బాబును మనోజ్ సాకడం వారికి ఇష్టం లేదని.. వీరికి గొడవ కావడానికి ప్రసాదే కారణం అని చెప్పారు. గొడవలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు నెట్టుకున్నారని చెప్పుకొచ్చారు పని మనిషి. తండ్రి పై మనోజ్ చేయి చేసుకోవడం మంచు విష్ణుకు ఆగ్రహం తెప్పించిందని వెల్లడించింది.