కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను కాలితో తంతానని చెబుతున్న మంచు విష్ణు భార్య విరోనికా

-

ఆలుమ‌గ‌ల మ‌ధ్య ఎవ‌రైనా స‌రే.. అడ్డుగా వెళితే ఏమ‌వుతుంది.. మ‌ధ్య‌లో వెళ్లిన వారికే ఎదురు దెబ్బ‌లు త‌గులుతాయి. స‌రిగ్గా న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు కూడా దాదాపుగా ఇలాగే జ‌రిగింది.

ఆలుమ‌గ‌ల మ‌ధ్య ఎవ‌రైనా స‌రే.. అడ్డుగా వెళితే ఏమ‌వుతుంది.. మ‌ధ్య‌లో వెళ్లిన వారికే ఎదురు దెబ్బ‌లు త‌గులుతాయి. స‌ర్ది చెబుదామ‌ని అనుకుని ముందుకు సాగుతారు. కానీ..ఆలు మ‌గ‌ల పోరులో న‌లిగిపోతారు. చివ‌ర‌కు వారు బాగానే ఉంటారు. కానీ మ‌ధ్య‌లోకి వెళ్లిన వారిదే త‌ప్ప‌వుతుంది. అవును.. స‌రిగ్గా న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు కూడా దాదాపుగా ఇలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

manchu veronica says she will kick kajal aggarwal

న‌టుడు మంచు విష్ణు భార్య విరోనికా గ‌ర్భంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సారి విరోనికా డెలివ‌రీని ఇన్‌స్టాగ్రాంలో లైవ్ పెడ‌తాన‌ని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. చాలా సార్లు డిస్క‌ష‌న్ చేసిన త‌రువాత త‌న భార్య డెలివ‌రీని ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌లో పెడ‌దామ‌ని అనుకుంటున్నాన‌ని విష్ణు అన్నాడు. ఇక ఐడియా ఇచ్చింది కాజ‌ల్ అగ‌ర్వాలేన‌ని విష్ణు ట్వీట్ చేశాడు. అయితే దీనిపై మంచు విష్ణు భార్య విరోనికా మండి ప‌డింది. మంచు విష్ణు ట్విట్ట‌ర్ ఆ పోస్టులు పెట్టిన కొద్ది సేప‌టికే విరోనికా త‌న దైన శైలిలో కౌంట‌ర్ వేసింది. ఇంత‌కీ విరోనికా ఏమ‌న్న‌దంటే…

త‌న భ‌ర్త మంచు విష్ణు పెట్టిన పోస్టుల‌పై స్పందించిన విరోనికా.. ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చినందుకు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తంతాన‌ని పోస్ట్ చేసింది. అందులో ఆలోచించ‌డానికి కూడా ఏమీ లేద‌ని విరోనికా అన్న‌ది. అలాగే భ‌ర్త విష్ణుపై కూడా విరోనికా కోప్ప‌డింద‌ట‌. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎందుకు చేస్తారోన‌ని ఆగ్ర‌హించింద‌ట‌. దీంతో విష్ణు కూడా మ‌న‌స్సు మార్చుకుని కొన్ని కార‌ణాల వ‌ల్ల తాను అంత‌కు ముందు తెలిపిన నిర్ణ‌యం మార్చుకుంటున్నాన‌ని తెలిపాడు. ఇక న‌టుడు, విరోనికా మామ మోహ‌న్ బాబు స‌పోర్ట్ కూడా విరోనికాకే ఉండ‌డంతో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోక త‌ప్ప‌డం లేద‌ని విష్ణు మ‌రో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ వివాదం అక్క‌డికి స‌ద్దుమ‌ణిగింది. మొత్తానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇలా ఆలుమ‌గ‌ల మ‌ధ్య వెళ్లి అన‌వ‌స‌రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఇప్పుడీ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news