మంచు విష్ణు “జిన్నా” టీజర్ విడుదల

-

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది.

ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించారు. వాళ్ళిద్దరితో కలిసి ఈ జిన్నా మూవీ కోసం ప్రమోషన్ ఫుల్లుగా ప్లే చేస్తున్నారు మంచు విష్ణు. ఇటీవలే ఈ చిత్రం నుండి సన్నీలియోన్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి ఫుల్ రెస్పాండ్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సన్నీలియోన్ ఫుల్ లెన్త్ రోల్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ని విడుదల చేశారు.

ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటుంది. టెంట్ హౌస్ కు ఓనర్ గా మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఏ పని చేయకుండా ఊరంతా అప్పులు చేస్తూ గడుపుతున్న విష్ణు లైఫ్ లోకి సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. అయితే టీజర్ లో సన్నీలియోన్ కు దయ్యంం పట్టినట్లు తెలుస్తోంది. మరి ఆ దయ్యం నుండి సన్నీలియోన్ ను విష్ణు ఎలా కాపాడాడు? అనేది సినిమా నేపథ్యం అన్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తుంటే మంచు విష్ణు ఈసారి హిట్ కొట్టబోతున్నట్టు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version