ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా సినిమాల లోని ఈమె గ్లామర్ వలకబోస్తూ ఉంటుంది. అలాంటిది ఇక సమ్మర్లో అందులోనూ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే హాట్ ఫోటోల రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. హీరోయిన్ చేతులో శ్రద్ధా దాస్ తిన్నదట. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ శ్రద్ధ దాస్ తెలిపారు.
బాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా తనను కావాలని కొట్టిందని హీరోయిన్ శ్రద్ధ దాస్ తెలిపారు. ‘జిద్ అనే మూవీలో మన్నారా, నేను కలిసి నటించాం. ఓ సీన్ లో నన్ను నెమ్మదిగా కొట్టాలి. కానీ ఆమె గట్టిగా కొట్టింది. దీంతో నా శరీరంపై 30 చోట్ల గాయాలయ్యాయి. మరో సీన్ లో చాతిపై బలంగా దాడిచేసింది. మరోసారి కర్రతో కొట్టడంతో నా కంటికి గాయమై ఆసుపత్రి పాలయ్యా’ అని చెప్పారు. కాగా, ప్రియాంక చోప్రాకు మన్నారా చోప్రా కజిన్.