Mega -157: చిరంజీవితో జతకట్టబోతున్న సీతారామం బ్యూటీ.. నిజమేనా..?

-

టాలీవుడ్ లోకి సీతారామం చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడి పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలోనే నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాతో పాటు విజయ్ దేవరకొండ నటిస్తున్న 13వ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తోంది.. తాజాగా ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్టులో అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి నటిస్తున్న 157 వ సినిమాని డైరెక్టర్ వశిష్టత తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కథానాయకగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇందులో ఈమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండబోతుందని సమాచారం. అయితే మేకర్స్ ఆల్రెడీ ఈ విషయంపై ఈమెను సంప్రదించినట్లుగా కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ సినిమా నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Uv క్రియేషన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు సోఫియా ఫాంటసీ చిత్రంలో తెరకెక్కిస్తున్న సినిమాని ఈ చిత్రాన్ని ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది.. చిరంజీవి గతంలో అంజి సినిమాతో సోఫియా బ్యాక్ డ్రాప్ ని టచ్ చేయడం జరిగింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి బ్యాడ్ గ్రాఫ్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మెగా అభిమానులు భావిస్తూ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news