నెట్టింట మెగా కోడళ్ల లవ్లీ పోస్టులు వైరల్

-

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజే వేరు. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ఫ్యామిలీ సభ్యులంతా సంక్రాంతి పండుగకు మాత్రం ఒకచోట కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి వేడుకలు కలిసి చేసుకుంటోంది మెగా ఫ్యామిలీ.

సంక్రాంతి సెలబ్రేషన్స్‌ కోసం చిరంజీవి – అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి తెగ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలను మెగా కోడలు ఉపాసన తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు. ఇంటి డెకరేషన్‌, విందు భోజనం, స్నాక్స్‌ – కాఫీ టైమ్‌, మెహందీ, యోగా టైమ్‌ అంటూ పలు వీడియోలను ఉపాసన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టారు.

ఇటీవలే మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ.. ‘‘కొత్త కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తోంది. ఆమె ఎంతో స్వీట్‌’’ అని ఉపాసన వీడియో పోస్ట్‌ చేశారు. దీనిపై లావణ్య స్పందిస్తూ. ‘‘థ్యాంక్యూ.. సూపర్‌ స్వీట్‌ పెద్ద కోడలు’’ అని రిప్లై ఇచ్చారు. ఈ ఇద్దరు మెగా కోడళ్ల స్వీట్ పోస్టును చూసి నెటిజన్లు వెరీ లవ్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version