‘మెగా’ ఇంట పెళ్లి సందడి?.. సాయి దుర్గా తేజ్‌ రియాక్షన్ ఇదే

-

మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయా? అనే ప్రచారంపైపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ స్పందించాడు. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్పై మాట్లాడుతూ.. ‘‘నా సినిమాలో ‘నో పెళ్లి’ (సోలో బ్రతుకే సో బెటర్‌) అనే పాట ఉంది తెలుసు కదా’’ అని సమాధానం ఇచ్చారు. ‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తేజ్ను యాంకర్‌ ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని అడిగారు.

దీనికి సమాధానమిస్తూ.. ‘‘వన్‌సైడ్‌ లవ్‌ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనే సమాధానం వస్తోంది. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు’’ అని రిప్లయ్‌ ఇచ్చాడు. ఇక ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై సాయి తేజ్‌ స్పందిస్తూ.. చిన్నప్పుడు తాను ఆటల్లో గెలిచినప్పుడు ఆయన ఎలా ఆనందించే వారో తన మామ ఎలక్షన్స్లో గెలిచినప్పుడు తాను కూడా అలానే ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు సాయి దుర్గాతేజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version