అంతరిక్షం వరుణ్ తేజ్ కు బిగ్ లెసన్

-

మెగా హీరో వరుణ్ తేజ్ కు ఊహించని షాక్ తగిలింది.. అదేంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ కు షాక్ ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్.. మొదటి సినిమా ముకుంద నుండి సినిమా సినిమాకు కొత్తదనం కావాలని ప్రాకులాడుతూ వస్తున్న వరుణ్ తేజ్ కు కంచె ద్వారా హిట్ వచ్చింది. ఆ తర్వాత ఫిదా, తొలిప్రేమ సినిమాలు వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి.

మంచి ఫాంలో ఉన్నట్టు కనిపించిన వరుణ్ తేజ్ కు అంతరిక్షం తన ఇమేజ్ ను డబుల్ చేస్తుందని ఆశించారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. ఘాజి సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి మరోసారి అలాంటి ప్రయత్నంగా చేసిన సినిమా అంతరిక్షం. రానా చేసిన ఘాజి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది అందుకే ఆ సినిమా హిట్ అందుకుంది. అయితే అంతరిక్షం విషయం అలా కాదు. సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా చేసేసరికి అంచనాలు పెరిగాయి. పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన అంతరిక్షం మూవీ కేవలం 6 కోట్లు మాత్రమే రాబట్టింది అంటే అంతరిక్షం ఎంత పెద్ద డిజాస్టర్ అన్నది అర్ధం చేసుకోవచ్చు.

ఇక మీదట వరుణ్ తేజ్ ఇలాంటి రిస్కులు చేయకుండా ఉంటే బెటర్. అంతరిక్షం నిరాశపరచాగా వెంకటేష్ తో పాటుగా చేస్తున్న ఎఫ్-2 సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version