అయ్యప్ప ఆలయ ఘటనకు..హైదరాబాద్ లో నిరసనలు..

-

గత కొద్ది రోజులుగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా అయ్యప్ప ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు మహిళలు రెండు రోజుల క్రితం ప్రవేశించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనను నిరసిస్తూ.. పలు రాష్ట్రాల్లో భక్తులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

ఇందులో భాగంగా  హైదరాబాద్‌లోని పలు అయ్యప్ప ఆలయాల్లో భక్తులు సమూహంలా ఏర్పడి భారీ ర్యాలీ నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పుని అడ్డం పెట్టుకుని అటు కేరళ ప్రభుత్వం ఇటు భాజపా వ్యవహరిస్తున్న తీరుని వారు తప్పుబట్టారు. ముఖ్యంగా సైదాబాద్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పులువురు న్యాయవాదులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడిగా వస్తున్న ఆచారాలను కాలరాయడం ప్రభుత్వాల పనితీరుకి నిదర్శనమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version