విశాల్‌ ఛాతీపై మాజీ సీఎం టాటూ.. ఎవరిదంటే..?

-

తమిళ హీరో విశాల్.. తన ఛాతీపై టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ టాటూ ఏదో పేరో.. సింబలో కాదు.. ఓ హీరోది. ఆయన కేవలం హీరోనే కాదు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిది. ఆయనే దివంగత ఎంజీఆర్.

ఎంజీఆర్ నటనకు, నాయకత్వానికి విశాల్‌ పెద్ద అభిమాని అని, అందుకే ఇలా చేశారని కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు, ‘అది పర్మినెంట్‌ టాటూ కాదేమో? ఏదైనా సినిమాలోని పాత్ర కోసం అది ప్రయత్నించారేమో’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా తాజా ఫొటోలో విశాల్‌ హెయిర్‌ కటింగ్‌, క్లీన్‌ షేవ్‌తో చాలా కొత్తగా కనిపించారు.

గతేడాది ‘సామాన్యుడు’, ‘లాఠీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశాల్‌ ప్రస్తుతం ‘మార్క్‌ ఆంటోని’ అనే సినిమాలో నటిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ సినిమాలో రీతూవర్మ కథానాయిక. ఆ చిత్రం పూర్తయిన తర్వాత విశాల్‌ ‘డిటెక్టివ్‌ 2’లో నటించనున్నారు. ఆ మూవీకి డైరెక్షన్‌ కూడా ఆయనే చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version