Mohan Babu Health Bulletin released: మంచు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసింది వైద్య బృందం.కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్యం పరిస్థితి… చాలా క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. 200 బిపి తో ఆస్పత్రికి వచ్చారట.
మోహన్ బాబు ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించారు. మోహన్ బాబు ఎడమకంటికి చిన్న గాయమైందని.. బీపీ లెవల్స్ పెరిగాయని తెలిపారు. మోహనాబాబుకు తన పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని వైద్యులు తెలిపారు. కుడి కంటి కింద వాపు ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, నిన్న ఆస్పత్రిలో మంచు మోహన్ బాబు చేరిన సంగతి తెలిసిందే.