Marakkar Review: పాన్ ఇండియా చిత్రం ”మోహన్ లాల్ మరక్కార్” సినిమా రివ్యూ, రేటింగ్..!

-

మలయాళం తమిళ భాషల్లో రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ”మోహన్ లాల్ మరక్కార్” విడుదలకు ముందే పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకుల దృష్టి సినిమా పై మరింత పడింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులో మోహన్ లాల్ కి చాలా మంచి గుర్తింపు లభించింది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని విడుదల చేసింది. బాహుబలి లెక్కలో విజువల్స్ ఉండడంతో ప్రేక్షకులకి ఆసక్తి మరింత పెరిగింది.

 

నటీనటులు:

మోహ‌న్‌లాల్‌, సుహాసిని, ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, కీర్తిసురేష్‌, అర్జున్ స‌ర్జా, సునీల్‌శెట్టి, మంజు వారియ‌ర్‌, నెడుముడి వేణు మొదలైనవారు.

స్క్రీన్‌ప్లే:

ప్రియ‌ద‌ర్శ‌న్, అని శ‌శి

సంగీతం:

రోనీ రాఫెల్‌

నేప‌థ్య సంగీతం:

రాహుల్ రాజ్‌, అంకిత్ సూరి, లైల్ ఎవ్‌నాస్ రోడ‌ర్‌

ఛాయాగ్ర‌హ‌ణం:

తిరునావుక్క‌ర‌సు

కూర్పు:

అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌

నిర్మాణం:

ఆంటోనీ పెరంబ‌వూర్‌

ద‌ర్శ‌క‌త్వం:

ప్రియ‌ద‌ర్శ‌న్‌

స్టోరీ:

 

ఈ చిత్రం 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్రయినా కుంజలి మరక్కార్ ఆధారంగా తీశారు. మహమ్మద్ అలీ అనే వ్యక్తి సముద్ర యుద్ధ వ్యూహంలో ఆరితేరినవాడు. అతనే మోహన్ లాల్. అయితే కొచ్చిన్ పై పోర్చుగీసులు దాడికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరక్కార్లు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారు. పోర్చుగీస్ సైన్యంతో తన కుటుంబం మొత్తాన్ని కళ్ళముందే చంపేస్తారు. అప్పటి నుండి కూడా కుంజలి మరక్కార్ కనపడకుండా ఉంటాడు.

తాను పోర్చుగీస్ పై ప్రతీకారం తీర్చుకుంటా అని ఆన పెడతాడు. ఆ సమయంలో కొచ్చిన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీసు సైన్యం ఒక ప్లాన్ ని వేస్తుంది. అయితే సముద్రంలో వాళ్ళని అడ్డుకోవడం కోసం మరక్కార్ సరైన వ్యక్తిని నమ్మి సైన్యానికి లెఫ్టినెంట్ గా నియమిస్తారు. అయితే ఎలా యుద్ధం చేస్తారు..?, గెలుపు ఎవరిది అనేది కధ.

కేవలం సాంకేతికత పై ఆధారపడి తీసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, ఫైటింగ్ సీన్లు, కథ కూడా ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. అలానే హీరోయిజం, డ్రామా, సెంటిమెంట్ లాంటివి కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.

చాలామంది నటీనటులు ఇందులో నటించారు. పైగా ఈ సినిమాలో ప్రతీ పాత్రలో కూడా సంఘర్షణ ఉంటుంది. ఎన్నో సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మోహన్ లాల్ పాత్ర పోషించిన పాత్ర చాలా కీలకమైనది. ఫైటింగ్స్ లో చాలా అద్భుతంగా నటించాడు. అలానే కీర్తి సురేష్ మంజు వారియర్ కూడా చిన్న చిన్న పాత్రలు చేశారు.

సినిమా ప్లస్లు:

మరక్కార్ క్యారెక్టర్
విజువల్ ఎఫెక్ట్స్
సంగీతం
ఫైటింగ్స్

సినిమా మైనస్లు:

భావోద్వేగాలు సరిగ్గా లేకపోవడం
కథనం

రేటింగ్: 2.25 /5

Read more RELATED
Recommended to you

Exit mobile version