ఆ స్క్రిప్ట్ అద్భుతం.. #Nani30 సినిమాపై మృణాల్ ఠాకూర్ కామెంట్స్

-

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్​లో అవకాశాలు వరుసకట్టాయి. మృణాల్.. నేచురల్ స్టార్ నాని 30వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

అయితే తాజాగా మృణాల్ బాలీవుడ్ సినిమా గుమరాహ్​లో పోలీస్ పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 7న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది మృణాల్‌. ఈ ఇంటర్వ్యూలో నేచురల్‌ స్టార్‌ నానితో చేయనున్న సినిమా (Nani30) స్క్రిప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘Nani30 సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్‌ను ఇప్పటి వరకు చదవలేదని మృణాల్ చెప్పింది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిపింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభమవుతుందని.. ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. నాని 30వ చిత్రంతో సౌరవ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version