మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో రెండో రోజు కొనసాగుతున్న ఐటి సోదాలు

-

మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ రెండో రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లోపలే ఐ టి అధికారులు ఉన్నారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా 500 కోట్ల వరకు విదేశాల నుండి పెట్టుబడులు, డిసెంబర్ లో ఐటీ అధికారులకు అందించిన లెక్కలు వాటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వ్యత్యాసాల పై ఐ టి ఆరా తీస్తున్నారు.

హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు కలిగిన ఎన్‌ఆర్‌ఐలుగా ఉన్నట్లు ఐ టి శాఖ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించి, ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITRs) తప్పుడు వివరాలను అందించారని, జి ఎస్ టి చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సినీ నిర్మాణ సంస్థ ఉద్యోగులను, ప్రొడక్షన్ మేనేజర్ ను నిన్న విచారించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఐటీ అధికారులు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version