సందీప్ వంగ‌ జారిపోతాడ‌ని మైత్రీకి టెన్ష‌న్?

-

ఇటు సందీప్ ప‌ట్టుద‌ల‌..అటు స‌ల్మాన్ గాలం చూసి సందీప్ మైత్రీ సంస్థ నుంచి ఎక్క‌డా జారిపోతాడోన‌ని సంస్థ టెన్ష‌న్ ప‌డుతోందిట‌. అందుకే అత‌నిపై ఇంత‌గా ఒత్తిడి తీసుకొస్తుంద‌ని నిర్మాణ వ‌ర్గాల స‌న్నిహితుల నుంచి తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి ని బాలీవుడ్ లో క‌బీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు సందీప్ వంగ‌. 200 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయం. దీంతో తొలి సినిమాతోనే బాలీవుడ్ దిగ్గ‌జాల దృష్టిలో ప‌డ్డాడు. స‌ల్మాన్ ఖానే స సందీప్ తో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అత‌ని బిజీ షెడ్యూల్ అనంత‌రం సందీప్ కు ఏ క్ష‌ణ‌మైనా స‌ల్మాన్ నుంచి పిలుపు రావొచ్చు. అప్ప‌టికి అన్ని ర‌క‌గాలు న‌యా ద‌ర్శ‌కుడు సిద్దం కావాల్సి ఉంటుంది. అయితే ఈ విష‌యం గ‌మ‌నించిన సందీప్ ఎక్క‌డ చేజారి పోతాడ‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ కి టెన్ష‌న్ ప‌ట్టుకుందిట. మ‌హేష్‌-మైత్రీ-సందీప్ కాంబినేష‌న్ లో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

సందీప్ క‌థ చెప్పిన క‌థ‌లు న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌హేష్ ఆ ప్రాజెక్ట్ ను డిలే చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో అనీల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ‌రు చేయాల్సి వ‌చ్చింద‌న్న సంగ‌తి తెలిసిందే. సందీప్ ద‌గ్గ‌ర క‌థ లేక‌పోవ‌డం, మ‌హేష్ చెప్పిన క‌థ‌ల‌ను రిజెక్ట్ చేయ‌డం వంటివి చేయ‌డంతో మైత్రీ మూవీస్ ఇర‌కాటంలో ప‌డింది. దీంతో స‌ద‌రు సంస్థ మ‌హేష్ క‌న్నా ముందగా మ‌రో హీరోతో సినిమా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తుందిట‌. కావాలంటే మ‌హేష్ తో మ‌రో సినిమాకు ఒప్పందం చేసుకుందాం గానీ, ముందు ఏదో ఒక హీరోతో సినిమా స్టార్ట్ చేద్దామ‌ని బుజ్జ‌గిస్తున్నారుట‌. అయితే సందీప్ మాత్రం చేస్తే కేవ‌లం మ‌హేష్ సినిమానే చేయాల‌ని క‌రాఖండీగా చేప్పేసాడుట‌.

ఆయ‌న ఒకే అనే వ‌ర‌కూ క‌థ‌లు రాస్తూనే ఉంటాను త‌ప్ప రాసిన క‌థ‌ను మ‌రో హీరోతో మాత్రం చేసేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసాడుట‌. ఇటు సందీప్ ప‌ట్టుద‌ల‌..అటు స‌ల్మాన్ గాలం చూసి సందీప్ మైత్రీ సంస్థ నుంచి ఎక్క‌డా జారిపోతాడోన‌ని సంస్థ టెన్ష‌న్ ప‌డుతోందిట‌. అందుకే అత‌నిపై ఇంత‌గా ఒత్తిడి తీసుకొస్తుంద‌ని నిర్మాణ వ‌ర్గాల స‌న్నిహితుల నుంచి తెలుస్తోంది. మ‌రీ మైత్రీ టెన్ష‌న్ కి మ‌హేష్‌, సందీప్ ఎప్పుడు పుల్ స్టాప్ పెడ‌తారో చూద్దాం. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టిస్తున్నాడు. సందీప్ వంగ క‌బీర్ సింగ్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version