RRR ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఆస్కార్​ వేదికపై ‘నాటు నాటు’ లైవ్​ షో

-

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్​ఆర్. విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్​ హిట్​ టాక్ సంపాదించుకుంది. ఇక రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటిని తిరగ రాస్తూ అవార్డుల పంట పండిస్తోంది. ఇందులోని పాటలు, ఫైట్స్, డ్యాన్స్ ఇలా ప్రతి ఒక్కటి సెన్సేషనే. ముఖ్యంగా నాటు నాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న క్రేజ్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకుల మనసు గర్వంతో ఉప్పొంగిపోతోంది.

ఈ సినిమాలో నాటు నాటు పాట.. బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ క్యాటగిరీలో ఆస్కార్​ నామినేషన్​ కూడా దక్కించుకుంది. మార్చి 12న ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకల్లో నాటు నాటు పాట లైవ్​ ప్రదర్శన ఉంటుందని గత కొద్దిరోజులగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఆస్కార్​ నిర్వాహకులు స్పందించారు. మార్చి 12న ఆస్కార్​ వేదికపై నాటు నాటు లైవ్​ షో ఉంటుందని ప్రకటించారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్​, కాలభైరవ ఈ పాటకు ప్రదర్శన ఇస్తారని వెల్లడించారు.

దీంతో అభిమానులు ఫుల్​ ఖుషీ అవుతున్నారు. నాటు నాటుకు ఆస్కార్​ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ షోలో హీరోలు రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ స్టెప్పులు వేస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version