‘జబర్దస్త్’ నాశనానికి కారకులు వాళ్లే…. నాగబాబు షాకింగ్ కామెంట్స్….!!

-

ఈటివి ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తెలియని వారు ఉండరు అనే చెప్పాలి. మొదట్లో ఇటువంటి షోలు ఎంతవరకు నడుస్తాయి అని వ్యాఖ్యానించినవారికి, మెల్లగా ఈ షో దినదినాభివృద్ధి చెందుతూ నేడు టాప్ మోస్ట్ రేటింగ్స్ సాధించే షోల్లో ఒక షో గా నిలిచి చెంప పెట్టుగా నిలిచింది జబర్దస్త్. ఇక ఈ షోలో నటిస్తున్న చాలా మంది పార్టిసిపెంట్స్ సినిమాల్లోకి వెళ్లి పలు అవకాశాలతో ముందుకు సాగుతున్నారు. ఇకపోతే ఈ షో నుండి అర్ధాంతరంగా బయటకు వచ్చిన జడ్జీల్లో ఒకరైన మెగాబ్రదర్ నాగబాబు, నేడు ఈ షోపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నిజానికి నాగబాబు ఈ షో నుండి బయటకు రావడానికి పెద్దగా కారణాలు ఏమి లేవని అందరూ భావించారు, అయితే ఇవాళ ఆయన తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసిన వీడియో చూస్తే జబర్దస్త్ లో రాజకీయం ఎంత జరుగుతుందో మనకు అర్ధం అవ్వక మానదు. ఇక మ్యాటర్ ఏంటంటే, తనకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మాట వాస్తవమేనని, దాదాపుగా ఏడేళ్లుగా ఆ షోతో తనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. అయితే ఆ షో నిర్వాహకులైన మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని, అయితే ఆ సంస్థలో కొందరి వల్లనే మొత్తం జబర్దస్త్ షో కు ప్రస్తుతం నష్టం చేకూరే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.

షోలో పార్టిసిపెంట్స్ కు ఏమైనా ప్రమాదం, లేదా అనారోగ్యం వంటి ఘటనలు జరిగితే మనకెందుకులే అనేలా వ్యవహరించేవారని, షోలో పని చేస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ ఇస్తున్నాం, అది సరిపోదా అనేలా ప్రవర్తించే వారి భావన సరైనది కాదని అన్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు పార్టిసిపెంట్స్ కు జరిగిన నష్టాలపై కనీసం ఆ సంస్థలోని వారు ఇప్పటికీ కూడా ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చలేదని అన్నారు. అయితే మల్లెమాలలో కొందరు మంచివారు ఉన్నప్పటికీ, మరి కొందరు సంస్థలో చేరి నష్టం చేకూరుస్తున్నారని సంచలనంగా వ్యాఖ్యానించారు. కాగా ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version