శ్రీశైలం మల్లన్నసేవలో నాగచైతన్య-శోభిత దంపతులు మెరిసారు. తాజాగా పెళ్లి చేసుకున్న నాగచైతన్య-శోభిత దంపతులు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగచైతన్య-శోభిత దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు, అధికారులు. అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగార్జున, నాగచైతన్య శోభిత దంపతు లు. కాగా డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య-శోభిత దంపతులు ఒక్కటైన సంగతి తెలిసిందే. నూతన దంపతులు నాగచైతన్య శోభితలది ప్రేమ వివాహం అని సమాచారం.
శ్రీశైలం మల్లన్నస్వామిని దర్శించుకున్న నటుడు అక్కినేని నాగార్జున, నూతన దంపతులు నాగచైతన్య శోభిత@iamnagarjuna @chay_akkineni @sobhitaD #Nagarjuna #NagaChaithanya #Bigtv pic.twitter.com/iQ2xitB1Ss
— BIG TV Breaking News (@bigtvtelugu) December 6, 2024