తెలంగాణ శాసనమండలి లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలకు బీఆర్ఎస్ భయపడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులు ప్రజలకు తెలుస్తాయని.. వాస్తవాలను దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని
మండలిలో మాట్లాడనివ్వడం లేదని మండిపడ్డారు. నిజాలు వినకుండా నిజాలు వినకుండా.. ఏ విధంగా తప్పించుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారో ప్రజలంతా గమనించాలని కోరారు. సభా
సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ్యులు ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు. నిరసన తెలుపాలంటే
వాకౌట్ చేసి పోవాలి.. కానీ ఇక్కడే అరుస్తూ నినాదాలు చేయడం కరెక్ట్ కాదు.. ఇకనైనా బీఆర్ఎస్
సభ్యులు తమ వైఖరిని మార్చుకోవాలని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.
అంతకుముందు శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు అడ్డగిస్తూ.. ఆందోళన చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ.. వైఖరి మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను హెచ్చరించారు.