ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

శ్రీకాకుళం  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది: ఓవర్టేక్ చేసే క్రమంలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామస్తులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


అయితే ఈ  ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. రోజు రోజుకూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా
ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు చర్యలు
తీసుకుంటున్నా వాహనదారుల్లో మాత్రం అవగాహన రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version