ఫిబ్రవరి 28, 2025 వరకు మేము తెచ్చిన మొత్తం అప్పు రూ. 1,58,041 కోట్లు అంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో కేసీఆర్ తెచ్చిన అప్పుకు రూ.88,591 కోట్ల అసలు, రూ.64,768 కోట్ల మిత్తి చెల్లించామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ 15 నెలల్లో కేసీఆర్ చేసిన అప్పుకు, మిత్తికే మేము అక్షరాల రూ. 1,53,359 కోట్లు చెల్లించామనని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆదిలాబాద్ కూడా ఎయిర్ పోర్టు తెస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ తెచ్చే బాధ్యత నాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సూచించిన వివరాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారని… తెలిపారు. లాల్ దర్వాజా అభివృద్ధికి నిధులు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. మీరు ఏ సమస్య చెప్పినా చేస్తానంటూ ప్రకటించారు.