ఈ సినిమాలో హీరో నాగార్జున కాద‌ట‌…!

-

ఇటీవ‌ల అక్కినేని నాగార్జున హీరోగా.. రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా నాగ్ అభిమానులు డీలాపడిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలోనే సాల్మన్ అనే కొత్త దర్శకుడితో నాగార్జున ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన సరసన కాజల్ ను అనుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమాలో నాగార్జున హీరో కాదట .. కానీ కథ మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతుందనేది తాజా సమాచారం. అంటే ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రధారిగా మాత్రమే కనిపించనున్నాడన్న మాట. నాయకా నాయికలుగా ఒక యువ జంట కనిపిస్తుందని అంటున్నారు. వాళ్లలో హీరో సంగతి తెలియదుగానీ, హీరోయిన్ గా మాత్రం కొత్త అమ్మాయినే తీసుకుంటారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version