నాగార్జున బాలీవుడ్ చిత్రానికి ఎదురవుతున్న ఇబ్బందులు..

టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సింది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం కరోనా కారణంగా వేసవిలో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఐతే తాజాగా ఈ చిత్రానికి నిర్మాతల నుండి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయట. చిత్ర నిర్మాతలైన ఫాక్స్ స్టార్ స్టూడియోస్, బ్రహ్మాస్త్ర నిడివిని అరగంట పాటు తగ్గించాలని దర్శకుడిని డిమాండ్ చేస్తున్నారట.

ఐతే దర్శకుడు అయాన్ ముఖర్జీ సహ నిర్మాత కరణ్ జోహార్ మాత్రం నిడివి తగ్గించబోమని, ఒక్క సీన్ కూడా తీసివేయడానికి లేదని, మూడు గంటల పాటు రన్ టైమ్ ఉండాల్సిందే అని చెబుతున్నారట. మరి ఈ సమస్యలు ఎప్పుడు తీరి బ్రహ్మాస్త్ర ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. పదిహేడు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ చిత్రాన్ని చేస్తున్న నాగార్జునకి నిర్మాతల ద్వారా ఇబ్బందులు రావడం ఆశ్చర్యకరమే.