లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ను ఆపే ప్రయత్నంలో నందమూరి ఫ్యామిలీ..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా రాం గోపాల్ వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్ అసలు కథ ఇదే అంటూ వర్మ చేస్తున్న ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఓ పక్క బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా ఈ శుక్రవారం వస్తున్నా ఆ సినిమాను ఎవరు పట్టించుకోవట్లేదు కాని లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి ఏ న్యూస్ వచ్చినా వదలట్లేదు.

సినిమా ప్రమోషన్స్ ట్రైలర్ తో పెంచేసిన వర్మకు సెన్సార్ ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారట నందమూరి ఫ్యామిలీ. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ లో నందమూరి ఫ్యామిలీని చెడుగా చూపించిన విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాను ఆపేయాల్సిందిగా పురందేశ్వరి సెన్సార్ టీం కు ఓ లెటర్ రాసిందట. అంతేకాదు సినిమాను రిలీజ్ ముందు తమకు ఓసారి చూపించారని ఆ లెటర్ లో రాసింది.

వర్మ మాత్రం అందరితో పాటే ఈ సినిమా చూడాలని.. ఒకవేళ అప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ప్రొసీడ్ అవ్వాలని వర్మ రిప్లై ఇచ్చాడట. అయితే ఇదంతా సైలెంట్ గా జరుగుతుందట.. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ ద్వారా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుందని సీక్రెట్ గా ఉంచుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version