ఇన్నాళ్లకు తన చిరకాల కోరికను బయట పెట్టిన నయనతార..

-

హాలీవుడ్ కోలీవుడ్లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది తన అందం నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ వామ తాజాగా తన మనసులో కోరికను బయటపెట్టింది.

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించినప్పటికీ ఒక డైరెక్టర్ తో పని చేయడం తన చిరకాల కోరిక అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా కోలీవుడ్ లో జరిగిన ఓ అవార్డు వేదికలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా నయనతార అవార్డును అందుకున్నారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ.. మణిరత్నం చేతుల మీదుగా అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. అందరూ నటీనటుల లాగే నాకు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. గతంలో ఒకసారి ఆయనతో నటించే అవకాశం వచ్చినప్పటికీ అప్పుడు కుదరలేదని కానీ ఇప్పుడు అవకాశం వస్తే తప్పకుండా అతనితో నటిస్తానని తెలిపింది. కాగా ప్రస్తుతం నయనతారే స్వయంగా అడగడంతో మణిరత్నం అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.

ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించగా మరి ఇందులో నయనతార నటించే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి. అయితే నయం సార్ ఇప్పటివరకు కమలహాసన్ సరసం కూడా నటించలేదు కాబట్టి ఈ సినిమాలో నటిస్తే క్రేజీ కాంబినేషన్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version