యూజర్స్​కు నెట్​ఫ్లిక్స్ షాక్.. ఇండియాలో పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్

-

ప్రముఖ ఓటీటీ నెట్​ఫ్లిక్స్ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇండియాలోనూ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విధానాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్‌ పొందగలరని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. అందులో నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై ఓటీటీ సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టంచేసింది.

కస్టమర్ల అభిరుచి, వారి సంతృప్తి మేరకే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీ షోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ వివరించింది. చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్‌ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని చెప్పింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఓటీటీ దిగ్గజం తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version