నయనతార పెళ్లి వీడియో పై క్లారిటీ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..!!

-

కోలీవుడ్ లో పాపులర్ లవ్ బర్డ్స్ గా పేరు పొందిన జంట ఎవరంటే నయనతార విఘ్నేష్ అని చెప్పవచ్చు.. గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుని ఈ జంట ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది చెన్నైలో మహాబలిపురంలో వీరు ఇరువురు కుటుంబాల, బంధుమిత్రుల సమావేశంలో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహానికి కోలీవుడ్ నుంచి పలువురు స్టార్ కపుల్స్ కూడా హాజరయ్యారు వీరితోపాటు బాలీవుడ్,టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు హాజరు కావడం జరిగింది.

కోలీవుడ్లో స్టార్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ మణిరత్నం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో పాటు జ్యోతిక, సూర్య తదితరులు కూడా ఈ స్టార్ సెలబ్రెటీల వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక ఈవెంట్ కోసం నయనతార, విఘ్నేష్ అందుకోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఈవెంట్ ను ప్లాన్ చేసి.. ఈ బాధ్యతలన్నీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కు అప్పజెప్పారు. దీని ఓటీటి హక్కులను కూడా దిగ్గజ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ కి భారీ ధరకే అమ్మేశారు. ఈ పెళ్లి వీడియోను స్ట్రిమ్మింగ్ చేసుకునేందుకు రూ.25 కోట్ల రూపాయలు నెట్ ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకున్నది.

ఇక ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార విఘ్నేష్ ఈ భారీ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నట్లుగా పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నయనతార విఘ్నేష్ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్ ద్వారా విఘ్నేష్, నయనతార ఇద్దరు కూడా స్టార్స్ లా కనిపిస్తున్నారు.. ఇద్దరు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ ఆనందంలో మేము చాలా ఆనందంగా డాన్స్ వేస్తున్నామని ట్వీట్ చేయడం జరుగుతుంది. దీంతో నయనతార విఘ్నేష్ పెళ్లి వీడియో పై వస్తున్న వార్తలతో క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఈ పెళ్లి వీడియో ఎప్పుడు స్ప్రింగ్ చేస్తారని విషయాన్ని తెలుపలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version