అల్లు అర్జున్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే..!

-

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప-2 మూవీ గురించే చర్చించుకోవడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 04న పుష్ప-2 ప్రీమియర్ షో ను సంధ్య థియేటర్ లో ప్రదర్శించడంతో అక్కడ తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం స్పందించిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించడం పై ప్రెస్ మీట్ పెట్టి.. సీఎం పేరు ఎక్కడా ప్రస్తావించకుండా అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడుతున్నారు. తొక్కిసలాట ఒక ప్రమాదం మాత్రమే అని.. ఆ ప్రమాదానికి ఎవ్వరూ బాధ్యులు కారు అని చెప్పుకొచ్చారు. ఎలాంటి రోడ్డు షో నిర్వహించలేదని చేసిన అల్లు అర్జున్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గతంలో మద్రాస్ కు పరిమితమైన తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కి తీసుకురావడంలో కాంగ్రెస్ సీఎంలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. నిండు ప్రాణం పోయింది. మరో పిల్లాడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎవరైనా ఆ బాలుడిని పరామర్శించారా..? అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version