భారత్ లో ఒక వైపు విజయ్ హాజరే ట్రోపీ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మరోవైపు అండర్ -23 స్టేట్ ఎ ట్రోపీలో సమీర్ రిజ్వీ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉత్తరప్రదేశ్-త్రిపుర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సమీర్ రిజ్వీ అజేయంగా 201 పరుగులు చేసాడు.
ప్రత్యర్థి త్రిపుర జట్టు భారీ స్కోర్ ను ఛేదించే క్రమంలో 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో సమీర్ రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో సమీర్ దేశవాళీ క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. అతను 103 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ 114 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన వారిలో ఒకడు.