‘ముఠామేస్త్రీ’ ఛాయలతో మెగాస్టార్ సినిమా..అభిమానులకు ఇక పండుగే

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..ఇటీవల ‘ఆచార్య’గా తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించాడు. అయితే, ఆ సినిమాలో చిరంజీవిగా కాకుండా సీరియస్ రోల్ ప్లే చేశాడు. దాంతో ప్రేక్షకులు అసలు చిరంజీవియేనా? అన్నట్లు అనుమానపడ్డారు. అలా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిందని పలువురు సినీ పరిశీలకుల విశ్లేషణ. కాగా, ఈ విషయాలన్నిటినీ గమనించిన దర్శకులు ఇక చిరును మాస్ హీరోగానే చూపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘ముఠామేస్త్రీ’గా ఊర మాస్ స్టెప్పులేసి తనదైన శైలి కామెడీ పంచ్ డైలాగ్ తో వెండితెరపైన అభినయం చేయగల మెగాస్టార్ ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి సీన్లనే యంగ్ డైరెక్టర్ బాబీ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చిరుతో ‘వాల్తేరు వీరయ్య’ ఫిల్మ్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి..ఫిషర్ మ్యాన్ గా ఊర మాస్ లుక్ లో కనబడనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తగ్గట్లు అభిమానులు కోరుకునే విధంగా చక్కటి ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ తీయబోతున్నారట. గతంలో చిరు నటించిన ‘ముఠా మేస్త్రీ’ సినిమాలోని ఛాయలు ఈ పిక్చర్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. హీరోయిన్ ను టీజ్ చేసే సీన్స్ తో పాటు మాస్ మసాలా సాంగ్స్ ఉండే లా చక్కగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. విదేశ యాత్ర ముగించుకుని ఇండియాకు వచ్చిన త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారని సమచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version