బిగ్‌బాస్ విన్న‌ర్ డిసైడ్ అయిన‌ట్టే.. చాంపియ‌న్ ఎవ‌రంటే..?

-

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది. షో ఇప్ప‌టికే 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఈ వారం ఒక‌రు ఎలిమినేట్ అవుతారా ?  లేదా ? ఇద్ద‌రా ? అన్న‌ది చూడాలి. ఈ రెండు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వెళ్లాల్సి ఉంటుంది. మ‌రి వీరిలో ఈ వారం ఒక‌రిని బ‌య‌ట‌కు పంపి చివ‌రి వారం ఇద్ద‌రిని బ‌య‌ట‌కు పంపుతారా ?  లేదా ? ఈ వార‌మే ఇద్ద‌రిని బ‌య‌ట‌కు పంపుతారా ? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.

ఇక తాజాగా బిగ్‌బాస్ షోలో ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క కంటెస్టెంట్‌ గేమ్స్ ప్లాన్ ఏంటి ? ప్రతి ఒక్కరు ఇంటి సభ్యులపై రహస్యంగా చేసిన కామెంట్స్‌ను సీక్రెట్‌గా వీడియోస్ ప్లే చేసి చూపించాడు. దాంతో ప్రతి సభ్యుడి గురించి మిగతా వారు ఏమనుకుంటున్నారో తెలిసింది. అయితే ఇందులో శ్రీముఖి వీడియో హైలైట్ గా నిలిచింది. బిగ్‌బాస్ షో అంటేనే ప్ర‌తి ఒక్క‌రిలో ఉన్న రియ‌ల్ క్యారెక్ట‌ర్ బ‌య‌ట‌కు తెప్పించేంత వ‌ర‌కు బిగ్‌బాస్ నిద్ర‌పోడ‌నే చెప్పాలి.

ఇక తాజా వీడియోలో చూస్తే శ్రీముఖి గేమ్‌ని అలీ, శివజ్యోతి, మహేష్ విట్టాలు తమదైన శైలిలో గుస‌గుస‌లాడుకున్నారు. ఈ వీడియో చూసిన శ్రీముఖి తాను గేమ్ ఆడేందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని… తాను ఏదైనా చెప్పాల‌నుకుంటే ముఖం మీదే మాట్లాడేస్తాన‌ని శివ‌జ్యోతితో చెప్పింది. చివరకు టాస్క్‌లో ఆమె మ‌హేష్ విట్టా స్టిక్క‌ర్ కుండ‌కు అంటించి ప‌గ‌ల‌గొట్ట‌డంతో పాటు అత‌డికి కార‌ణం చెప్ప‌కుండా ఆల్ ద బెస్ట్ చెపుతుంది.

అటు మ‌హేష్ సైతం త‌న‌ను టార్గెట్ చేసిన శ్రీముఖి స్టిక్క‌ర్ ప‌గ‌ల‌గొడ‌తాడు. ఇక తాజా సీజ‌న్లో హౌస్‌లో శ్రీముఖి న‌డుచుకున్న తీరు చూస్తుంటే అంద‌రికి బిగ్‌బాస్ 2లో విన్నర్ కౌశల్ గుర్తుకు వస్తాడు. కౌశల్ కూడా కేవలం గేమ్ కోసమే వచ్చనని పదే పదే చెప్పేవాడు. కౌశ‌ల్ ఎంతో మంది హీరోల‌ను, సీనియ‌ర్ల‌ను క్రేజ్ ఉన్న వాళ్ల‌ను కాద‌ని చాంపియ‌న్ అయ్యాడు.

క‌ట్ చేస్తే ఇప్పుడు కౌశ‌ల్‌తో పోలిస్తే శ్రీముఖికి చాలా క్రేజ్ ఎక్కువ‌. ఈ లెక్క‌న చూస్తే హీరో వ‌రుణ్ సందేశ్‌తో గ‌ట్టి పోటీ ఎదుర్కొని ఆమె గెల‌వ‌వ‌చ్చ‌న్న అంచ‌నాలు ఎక్కువుగా ఉన్నాయి. మ‌రి శ్రీముఖి ఏం చేస్తుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version