అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. న్యాయవాది అశోక్ రెడ్డి నేతృతంలో విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ ను డిసిపి సెంట్రల్ జోన్ నేతృతంలోని బృందం విచారిస్తోంది. సెంట్రల్ జోన్ అదనపు డిసిపి చిక్కడపల్లి ఏసిపి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిపి విచారణ చేస్తున్నారు. 50 పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు ఉంచారు అధికారులు. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు అధికారులు.
రాత్రి 9:30 గంటల నుంచి బయటికి వెళ్లే వరకు ఏం జరిగింది అనేదానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు అధికారులు. తొక్కిస్తులాట సంఘటనలో చనిపోయిన విషయం తెలుసా లేదా అని ప్రశ్నిస్తున్నారు అధికారులు. రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలుస్తదని అడుగుతున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రం వరకు అల్లు అర్జున్ విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది.