ఇస్మార్ట్ శంక‌ర్ బ్యూటీకి చేదు అనుభ‌వం.. స్టేజిపై ఇబ్బంది పెట్టిన ద‌ర్శ‌కుడు..

-

ఇస్మార్ట్ శంక‌ర్ ఫేమ్‌, హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. త‌మిళ న‌‌టుడు శింబుతో క‌లిసి నిధి అగ‌ర్వాల్ ఈశ్వ‌ర‌న్ అనే మూవీలో న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా ఆ మూవీకి చెందిన ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మాన్ని తాజాగా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆడియో లాంచ్ సంద‌ర్బంగా స్టేజిపై ఆమె కొంత అస‌హ‌నానికి, ఇబ్బందికి గురైంది.

ఈశ్వ‌ర‌న్ మూవీ ఆడియో లాంచ్ సంద‌ర్భంగా స్టేజిపై ద‌ర్శ‌కుడు సుశీంథిర‌న్‌తో క‌లిసి నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతోంది. అయితే సుశీంథిర‌న్ ఆమెను.. శింబు మామా, ఐ ల‌వ్ యూ.. అనాల్సిందిగా ప‌దే ప‌దే ఒత్తిడికి గురి చేశాడు. అయిన‌ప్ప‌టికీ ఆమె అలా అన‌కుండా వేరే విష‌యాలు మాట్లాడింది. ఆమె ఓ వైపు ఆ ప‌దాలు అన‌కుండా టాపిక్ డైవ‌ర్ట్ చేసి మాట్లాడినా సుశీంథిర‌న్ వినిపించుకోలేదు. శింబు మామా, ఐ ల‌వ్ యూ అన‌మ‌ని ప‌దే ప‌దే అడిగాడు.

అయితే సోష‌ల్ మీడియాలో సుశీంథిర‌న్ అలా నిధి అగ‌ర్వాల్‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన తీరుపై సర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అత‌నిపై నెటిజ‌న్లు, ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెను అలా ఇబ్బందుల‌కు గురి చేసి ఉండాల్సింది కాద‌ని, సుశీంథిర‌న్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డ‌మేమిటి, సిగ్గుచేట‌ని, ఇది ఎంత మాత్రం స‌హించ‌లేమ‌ని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ ద‌ర్శ‌కుడు మాత్రం ఈ విషయంపై స్ప‌ష్ట‌త‌నిచ్చాడు. ఆ ప‌దాలను తాను కావాల‌ని అన‌మ‌ని చెప్ప‌లేద‌ని, అవి ఆ సినిమాలోని డైలాగ్‌లో ఉన్న‌వ‌ని, అందుక‌నే అన‌మ‌ని చెప్పాన‌ని తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నిపై విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version